మెగాస్టార్ సినిమాపై కోర్ట్ ని ఆశ్రయించిన వ్యక్తి....!!
మే 1న హైదరాబాద్‌లో ఉన్న వారి ఆఫీసులో గరికపాటి కృష్ణ కిషోర్‌ను కలిశానని, ఆయన అనిల్ సుంకరతో మాట్లాడి... సినిమా డిజాస్టర్ ప్లాప్ అయ్యిందని.. మే 2న అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో... వైజాగ్ వెళ్లిపోయానని చెప్పారాయన... సామజవరగమన చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా విశాఖపట్నం వరకే ఇచ్చారని తెలిపారు. దీంతో కొంత మేర డబ్బులు రికవరీ అయ్యాయని, మిగితా డబ్బులు 45 రోజుల్లో తనకు రావలసిన డబ్బును చెల్లిస్తామని చెప్పారని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదలలోపు ఇస్తామని ఒప్పంద పత్రం రాసిచ్చారని అన్నారు. అయితే తదుపరి సినిమా భోళా శంకర్ విడుదల అయిందని, అయితే కొద్దిరోజులుగా తనకు సమాధానం ఇవ్వడం మానేశారని చెప్పారు.
ఫిలిం ఛాంబర్ పెద్దలకు విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో న్యాయం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లానన్నారు. విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్‌గా సినీ పరిశ్రమతో తనకు విడదీయలేని అనుబంధం ఉందన, రంగస్థలం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి అనేక సినిమాలను తాను డిస్ట్రిబ్యూషన్ చేశానని చెప్పారు. అయితే తన దగ్గర 30 కోట్లు తీసుకుని.. సమాధానం చెప్పకుండా, డబ్బులు ఎగొట్టాలనే తలంపుతో తనపై ఫోర్జరీ వేశాననే నింద కూడా వేశారని ఆరోపించారు. వాస్తవానికి యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో.. వీరిపై... ఆ సంస్థ కూడా కేసులు కూడా పెట్టిందన్నారు. ఇంకా ఎంతోమందికి వీరు బాకీ ఉన్నారని చెప్పారు. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, మరోవైపు క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేశానన్నారు. ఫైనాన్సియర్స్ అందరిపై ఈడీకి ఫిర్యాదు చేస్తానన్నారు.మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన నటించిన సినిమా అనే ఉద్దేశంతోనే తాను మీడియాకు ఎక్కకుండా ముందుకు సాగానన్నారు. అయితే తనపై ఫోర్జరీ నింద వేసి, ఆ వార్తలను గ్రూపుల్లో తిప్పేస్తూ, తనను అప్రదిష్టపాలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా నిజాయితీ, న్యాయం,గెలుస్తాయని నమ్ముతున్నానని చెప్పారు.