ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో లవర్ బాయ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ మెగా ఇంటికి అల్లుడుగా వెళ్లబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలు ఎంతలా వైరల్ అయ్యాయి అంటే ఈ వార్తలపై స్వయంగా తరుణ్ క్లారిటీగా ఇచ్చేంతవరకు వెళ్ళింది. అయితే తరుణ్ ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ నా పెళ్ళంటూ వస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేదు అని ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నేనే స్వయంగా క్లారిటీ ఇస్తాను అంటూ ఆ వార్తలకు చెక్ పెట్టాడు తరుణ్. అంతటితో ఆ వార్తలు ఆగిపోయాయి. అయితే మెగా ఫ్యామిలీకి అల్లుడుగా అంటే మెగా ఫ్యామిలీలో ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
అందులో ఇద్దరు కూతుర్లు భర్తలతో దూరంగా ఉంటున్నారు. ఇలా నిహారిక తరుణ్ణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దాంతో తరుణ్ రంగంలోకి దిగడం జరిగింది. తాజాగా నిహారిక సైతం ఈ వార్తలపై స్పందిస్తూ బోరుగా ఏడ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నిహారిక విడాకులు వచ్చినప్పటి నుండి ఈ రోజుకు ఒక వార్తల్లో నిలుస్తూ ట్రోల్ అవుతుంది. అయితే ఇప్పటికే పద్ధతిగా చీర కట్టుకుని ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ట్రోల్స్ కి గురవుతోంది. దీంతో ఇవన్నీ విడాకులు ఇవ్వకముందు చేసి ఉంటే నీ సంసారం బాగుండేది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
దానితోపాటు విడాకుల తర్వాత జిమ్ లో ఎక్కువగా గడుపుతుంది నిహారిక దాంతో డిప్రెషన్ లోకి వెళ్లకుండా స్నేహితులతో ఎంజాయ్ చేస్తోంది అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా తరుణ్ తో తన పెళ్లి పై నిహారిక స్పందించింది. సమాజంలో ఉన్న వాళ్ళకి వారి వ్యక్తిగత విషయాలు కంటే నా పర్సనల్ లైఫ్ ని ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అసలు నేను ఇప్పటివరకు తరుణ్ణి కలిసింది లేదు. మాట్లాడింది లేదు. అలాంటిది ఒక చెత్త రూమర్ ని మాపై ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఈమధ్య ఎలాంటి పరిచయం లేకుండానే తరుణ్ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది... అంటూ నిహారికను సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది..!!