తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయిన మొదటి రోజు భారీ కలెక్షన్ లను వసూలు చేశాయి. అందులో భాగంగా రీ రిలీజ్ లో మొదటి రోజు భారీ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన సినిమాల లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ... భూమిక హీరోయిన్ గా రూపొందిన ఖుషి సినిమా 4.5 కోట్ల కలెక్షన్ లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి సినిమా 4.01 కోట్ల కలెక్షన్ లతో రెండవ స్థానంలో నిలిచింది.
ఇక పోతే పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమా 3.20 కోట్ల కలెక్షన్ లతో 3 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమా 2.05 కోట్ల కలెక్షన్ లతో 4 వ స్థానంలో నిలిచింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది సినిమా 1.78 కోట్ల కలెక్షన్ లతో 5 వ స్థానంలో నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు అనగా ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బిజినెస్ మాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో 4 కే వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీ బుకింగ్ లకి సూపర్ సాలిడ్ రెస్పాన్సి లభించింది. దానితో ఈ మూవీ టాప్ 5 స్థానాలలో ఏదో ఒక స్థానంలో నిలుస్తుంది అని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మొదటి రోజు బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఇలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.