దానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి....!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీ లో సీనియర్ నటి గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటు వంటి వారి లో నటి జయప్రద ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా లను అందుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటు వంటి జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో చాలా బిజీగా మారిపోయారు. రాజకీయాల పరంగా ఎంతో బిజీ గా ఉండే ఈమె తాజా గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె బాలీవుడ్ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నటు వంటి పేర్లలో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి.అయితే మేము హీరోయిన్లు గా ఉన్న సమయం లో ఈ పేరు చాలా అరుదుగా వినే వాళ్ళమని,ప్రస్తుతం ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిపోయిందని తెలిపారు. మేం హీరోయిన్లుగా చేసే సమయం లో మాకు ఇలాంటి ఇబ్బందులు అసలు వచ్చేవి కాదని తెలిపారు.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ బహిరంగంగా చెబుతున్నారు.
ఇలా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ రావడానికి కారణం హీరోయిన్లే అంటూ ఈమె ఆరోపణలు చేశారు. అవకాశాలు రావాలి అంటే మనలో టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే కచ్చితంగా సినిమా అవకాశాలు వస్తాయి అయితే ప్రస్తుత కాలం లో ముంబై నుంచి ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటివారు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే దర్శక నిర్మాతలకు హీరోలకు వారే కమిట్మెంట్లు ఇస్తూ వారి పక్కలోకి వెళ్తున్నారు అంటూ ఈ సందర్భంగా జయప్రద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: