వండర్స్ క్రియేట్ చేస్తున్న బిజినెస్ మ్యాన్?

Purushottham Vinay
అసలు ఈమధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాల జోరు  మాములుగా ఉండటం లేదు. వారం వారం రిలీజవుతున్న కొత్త సినిమాల కంటే కూడా ప్రేక్షకులు ఆల్రెడీ చూసిన సినిమానే థియేటర్ లో మళ్ళీ చూసి బాగా ఎంజాయ్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.అందువల్ల మేకర్స్ కూడా ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు.ఇక ఇప్పటికే ఒక్కడు, ఖుషి, పోకిరి ,ఆరెంజ్, సింహాద్రి, దేశముదురు ఇంకా సూర్య సన్ అఫ్ కృష్ణన్ సినిమాలు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడగా, లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అయింది.ఇక ఈ ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వస్తుండటంతో ఆయన కెరీర్ లో గుర్తుండిపోయిన సినిమాల్లో ఒకటైన బిజినెస్ మ్యాన్ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఒరిజినల్ గా రిలీజ్ చేసినపుడు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కానీ రీ రిలీజ్ లో మాత్రం ఈ సినిమా రికార్డ్ స్థాయి బుకింగ్స్ తో బ్లాక్ బస్టర్ అయ్యే విధంగా దూసుకుపోతుంది.



కేవలం హైదరాబాదులోనే బిజినెస్ మ్యాన్ సినిమా 150 వరకు షోల వరకు ప్రదర్శించబడుతుండగా, ఇప్పటి దాకా ఈ సినిమా కేవలం అడ్వాన్స్ ద్వారానే ఏకంగా 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.దీన్నిబట్టి చూస్తే బిజినెస్ సినిమాపై ప్రేక్షకులకు ఎంత అభిమానం ఉందొ పూర్తిగా అర్థమవుతోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు 20 లక్షల పైగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల మాత్రమే వచ్చాయని సమాచారం తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే బిజినెస్ మ్యాన్ సినిమా ఇప్పటి దాకా దాదాపు 3 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్. సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే అన్ని షోలు ఫుల్ అయిపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటి దాకా రీ రిలీజ్ అయిన అన్నీ రీ రిలీజ్ సినిమాల్లో అతితక్కువ సమయంలో ఈ రేంజ్ స్పీడ్ లో టికెట్స్ బుక్ అవడం ఇదే మొదటిసారి అని సమాచారం తెలుస్తోంది. మరీ రిలీజ్ తరువాత బిజినెస్ మ్యాన్ సినిమా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: