మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా రూపొంది అద్భుతమైన విజయం సాధించినటువంటి వేదాళం అనే మూవీ కి అధికారిక రూపొందుతుంది. ఇకపోతే భోళా శంకర్ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే చిరంజీవి ... తమన్నా కాంబోలో సైరా నరసింహారెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందింది.
ఇది వీరిద్దరి కాంబోలో రెండవ సినిమా. ఇకపోతే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందింది. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో మహానటి కీర్తి సురేష్ కనిపించబోతుండగా ... సుశాంత్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించగా మహతీ స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ నెల 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను ... పాటలను ... టీజర్ ... ట్రైలర్ ను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రేస్ ఆఫ్ భోళా అంటూ సాగే ఒక పాటను విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఆగస్టు 11 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.