స్టార్ హీరోయిన్ హోదాలో ఉండి కూడా అలాంటి పనులు చేస్తున్న అనుపమ..!?

Anilkumar
మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరున్  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అన్న సంగతి తెలిసింది. తెలుగులో ఈమె రెండు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇక అందులో జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు  స్క్వేర్ ఒకటి. కాగా మరొకటి మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ సినిమా. ఈ రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది అనుపమ. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దానితోపాటు మలయాళం లో కూడా ఒక సినిమా  తమిళంలో కూడా ఒక సినిమా చేస్తూ దూసుకుపోతోంది అనుపమ. అయితే చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ


 అనుపమ ప్రైవేటు ఆల్బమ్స్లో నటిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి ఏమైనా టాలీవుడ్ లో ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ కు అంత క్రేజ్ ఉండదు. ఇక్కడి సెలబ్రిటీలో ఎవరు కూడా అలాంటి ఆల్బమ్స్ ఇప్పటివరకు చేయలేదు. కానీ అనుపమ మాత్రం మొదటిసారి చేసి షాక్ ఇచ్చింది. డబ్బు కోసమా లేక కొత్త ట్రెండ్ ఫాలో అవుతుందా అన్నది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల ఆమె చేసిన ఆల్బమ్ సాంగ్ విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ సాంగ్ను బయటకు వదిలారు పద పద అంటూ సాగే ఈ సాంగ్ రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు.


  ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. సింగర్ చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాటను డెన్నిస్ కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు జపాన్లోని టోక్యో అందాలు చూపిస్తూ ఎంతో కలర్ ఫుల్ గా ఈ పాట నుంచి తీయడం జరిగింది.  ఇందులో అనుపమ పరమేశ్వరన్ చాలా డిఫరెంట్ గెటప్స్లో కనిపించింది బ్చాలా ఉల్లాసంగా డాన్స్ వేస్తూ అందరిని ఆకట్టుకుంది అనుపమ. దీంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో దూసుకుపోతుంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా లభిస్తుంది. నెటిజన్స్ సాంగ్ బాగుందని సూపర్ గా ఉంది అని అనుపమ ఇందులో అదరగొట్టేసింది అంటూ అనుపమ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు వరుస సినిమాల్లో నటిస్తూ కూడా ఎందుకు ఇలా చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: