మెగా ఆఫర్ పై ఆశక్తికనపరచని సిద్దు జొన్నలగడ్డ ?

Seetha Sailaja
‘భోళాశంకర్’ మూవీ ఫలితం ఇంకా తెలియకుండానే చిరంజీవి మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. మెగా స్టార్ పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా మారి తన తండ్రితో తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘బ్రో డాడీ’ మూవీకి రీమేక్ గా తీయబడుతున్న సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ బయటపడింది.


‘బ్రో డాడీ’ మూవీలో మోహన్ లాల్ నటించిన తీరుకు మళయాళ ప్రేక్షకులు ఆమూవీకి కనకవర్షం కురిపించారు. ఈమూవీని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చిరంజీవి సలహాతో అనేక మార్పులు చేర్పులు చేసి త్వరలో ఈమూవీ షూటింగ్ ను పరుగులు తీయించాలని ఈమూవీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘బ్రో డాడీ’ మూవీలో మోహన్ లాల్ కు 60 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ అతడిలో రొమాంటిక్ యాంగిల్ ఏమాత్రం తగ్గకపోవడంతో పాటు ఈవిషయంలో తన కొడుకుతో పోటీ పడుతూ ఉంటాడు.


ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న కళ్యాణ్ కృష్ణ ఈమూవీలో అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈసినిమాలో తండ్రిగా కాకుండా 60 సంవత్సరాలు దగ్గర పడుతున్న రొమాంటిక్ అన్నయ్యగా కనిపిస్తూ తన తమ్ముడి పాత్రకు రొమాన్స్ పాఠాలు నేర్పిస్తూ ఉంటాడట. తమ్ముడు పాత్రకు మొదట్లో సిద్ధూ జొన్నల గెడ్డను అనుకుంటే కుదరకపోవడంతో ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి చిరంజీవి తమ్ముడుగా శర్వానంద్ మారాడు అని అంటున్నారు.


చిరంజీవికి జతగా త్రిషా శర్వానంద్ కు జతగా శ్రీలీల ఎంపిక అయిన ఈమూవీలో చిరంజీవి టాప్ కామెడీ యాంగిల్ కనిపిస్తుందని అంటున్నారు. ఈనెలలో ఈమూవీ షూటింగ్ ను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసి వచ్చే జనవరి సంక్రాంతి రేసులో ఈమూవీని తీసుకు రావాలని చిరంజీవి గట్టి పట్టుదల పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి భారీ మూవీలో సిద్దు జొన్నలగడ్డ ఎందుకు వదులుకున్నాడు అన్నది అర్థంకాని విషయం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: