చిరంజీవిని వెంటాడుతున్న మెగా టార్గెట్ !
దీనికితోడు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ కలక్షన్స్ రోజురోజుకూ పడిపోతూ ఉండటంతో మెగా అభిమానులు అంతా షాక్ అవుతున్నారు. కేవలం రెండు వారాల గ్యాప్ తో చిరంజీవి ‘భోళాశంకర్’ విడుదల అవుతోంది. దీనితో ఈమూవీ ఫలితం ఎలా ఉంటుంది అన్న టెన్షన్ మెగా అభిమానులలో ఉంది. ఈమూవీ కూడ తమిళ రీమేక్ కావడంతో ఈమూవీ గురించి చిరంజీవి అభిమానులు భయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ మూవీకి 130 కోట్ల వరకు నెట్ కలక్షన్స్ రావడంతో ‘భోళాశంకర్’ కూడ అదే రేంజ్ లో సక్సస్ అవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈసినిమాకు సంబంధించి మహతి స్వరసాగర్ అందించిన పాటలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఈమూవీ పై చెప్పుకోతగ్గ స్థాయిలో మ్యానియా లేదు. ఈమూవీ హిట్ అనిపించుకోవాలి అంటే కనీసం 100 కోట్ల నెట్ కలక్షన్స్ రాబట్టాలి.
ఈసినిమాకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ కు కానీ ఈమూవీలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించిన తమన్నాకు కానీ అదేవిధంగా చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ పై కానీ ఎటువంటి అంచనాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో కేవలం ఈసినిమా భారాన్ని పూర్తిగా చిరంజీవి మ్యానియా మోయవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ‘భోళాశంకర్’ కు సంబంధించిన భారీ టార్గెట్ ను మెగా స్టార్ చిరంజీవి తానొక్కడు ఎంతవరకు మోయగలడు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే వచ్చే వారం లాంగ్ వీకెండ్ తో పాటు ఆగష్టు 15 కూడ కలిసి వస్తూ ఉండటంతో చిరంజీవి ఈమెగా టార్గెట్ ను చాలసులువుగా చేరుకుంటాడు అని అతడి అభిమానులు ఆశిస్తున్నారు..