డీజే టిల్లుతో జతకట్టనున్న పాన్ ఇండియా హీరోయిన్...!!

murali krishna
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. త్వరలో డీజే టిల్లు సీక్వెల్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలలో ఈయన బిజీ అయ్యారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి సిద్దు గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దు జొన్నలగడ్డ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించబోతున్నారంటూ ఓ వార్త సంచలనగా మారింది.
ఇలా సిద్ధూ జొన్నలగడ్డ రష్మిక కాంబినేషన్లో సినిమా అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ క్షణం పాటు తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇక ఈమె ఈ మధ్యకాలంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి కూడా కమిట్ అయ్యారు. ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడమేంటి అని రష్మిక ఫ్యాన్స్ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతుంది. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్  కుటుంబం నుంచి ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన  దర్శకురాలిగా మారబోతున్న సంగతి మనకు తెలిసిందే. బాద్‌షా సినిమాలో ఎన్టీఆర్ అండ్ కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాస్ట్యూమ్ డిజైనర్ పని చేసి కెరీర్ మొదలు పెట్టినటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా మారిపోయారు. ఇలా ఫ్యాషన్ రంగంలో భారీగానే సంపాదించిన ఈమె దర్శకురాలిగా మారడానికి సిద్ధమయ్యారు.వెంకట్ కోన రాసిన కథ ఆధారంగా ఈమె సిద్దు జొన్నలగడ్డ రష్మికతో సినిమా చేయబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: