రవితేజ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. హిట్లు ప్లాపులు తో సంబందం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారాడు మన మాస్ మహారాజా. వాల్తేరు వీరయ్య సినిమాతో ఊహించిన విధంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ .దాని తర్వాత రావణాసుర సినిమా తో మల్లి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ రాబడితో దూసుకుపోతోంది ఈ సినిమా. దాని తరువాత ఒక ఫ్యాన్ ఇండియా సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.


మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో మళ్ళీపేక్షకులను ఆదరించడానికి రెడీ అయ్యాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నోపూర్ సనన్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాంతో పాటు రేణు దేశాయ్ సైతం ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నారు. చాలాకాలం తరువాత రేణు దేశాయ్ ఈ సినిమాతో ఇంటర్వ్యూ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమాని అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లుగా ముందుగా ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది అన్న సమాచారం వినబడుతోంది షూటింగ్ ఆలస్యం


 అవుతున్న కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ సినిమాపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.  ఈ సినిమాని అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తాం అని తెలపడం జరిగింది. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు విడుదల ఈ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అయితే ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం అక్టోబర్ 20 నుండి బాక్స్ ఆఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: