మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో అశ్విన్ బాబు..!!
ఈ సమయంలోనే అశ్విన్ బాబు సరికొత్త సినిమాని ప్రకటించడం జరిగింది.. ఆ సినిమా పేరు ఏమిటంటే వచ్చిన వాడు గౌతం.. ఈ చిత్రాన్ని అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు ప్రి లుక్ రివిల్ చేయడం జరిగింది చిత్రబృందం. వచ్చినవాడు గౌతమ్ అనే ఒక విభిన్నమైన టైటిల్ తో అశ్విన్ బాబు కొత్త సినిమాని రూపొందించారు. నటుడుగా మంచి పేరు సంపాదించిన అశ్విన్ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా సమాచారం.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని M.R రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అశ్విన్ బాబు సినిమాలు ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తమ అభిమానులు భావిస్తున్నారు. అశ్విన్ నటిస్తున్న చిత్రాలు లేటుగా విడుదల అవుతున్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదిస్తారేమో చూడాలి మరి. వచ్చినవాడు గౌతం అనే చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు చిత్ర బృందం త్వరలోనే తెలియజేస్తారేమో చూడాలి.