పొట్టి డ్రెస్ లో నేత్రానందం కల్గిస్తున్న పూనమ్ బజ్వా....!!
కవ్వించే చూపులతో, విరహంతో కూడిన పోజులిచ్చిందీ నాగ్ బ్యూటీ. పూనమ్ నాగార్జునతో `బాస్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. వైరల్‌గా మారాయి.పూనమ్ బజ్వా.. తొలి రెండు సినిమాలతో విజయాలను అందుకుంది. `మొదటి సినిమా`, `ప్రేమంటే ఇంతే` చిత్రాలతో హిట్ కొట్టింది. రెండూ లవ్ స్టోరీ చిత్రాలే. ఇందులో ఇన్నోసెంట్ లవర్‌గా మెప్పించింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే నాగార్జునతో `బాస్` చిత్రంలో నటించింది. ఆయనకు సెక్రెటరీగా కనిపించింది. చాలా హాట్‌గా కనిపించి షాకిచ్చింది.
అయితే క్యూట్ అందాలతో మెప్పించే పూనమ్.. ఇందులో హాట్‌గా కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాకపోతే సెకండాఫ్‌లోనే మెరిసింది పూనమ్. హీరోయిన్ నయనతారకి జెలసీ పుట్టించేపాత్రలో అదరగొట్టింది. హాట్ షో చేస్తూ టెంప్ట్ చేసింది. సెకండాఫ్‌లో కాసేపు రచ్చ చేసింది ఈ బ్యూటీ. కానీ సినిమా బోల్తా కొట్టడంతో పూనమ్ కి పెద్దగా పేరు రాలేదు.మధ్యలో `వేడుక`లో నటించి ఆకట్టుకుంది. అదే ఏడాది `పరుగు` చిత్రంలో కీలక పాత్రలో నటించింది. హీరోయిన్‌కి అక్కడ పాత్రలో మెరిసింది. ఆమె పాత్ర చుట్టూతే సినిమా తిరుగుతుంది. ప్రియుడితో పారిపోయిన పాత్రలో ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి సినిమాలు రాలేదు. తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తూ రాణించింది.ఆ మధ్య `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`లో గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలు లేవు. మలయాళంలో అడపాదడపా ఆఫర్లు వచ్చేవి. ఇప్పుడు అవి కూడా లేనట్టు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటోంది. హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది పూనమ్ బజ్వా.