నాగార్జున వైపు అడుగులు వేస్తున్న శేఖర్ కమ్ముల !

Seetha Sailaja
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటిపోతున్నా ఇంకా 10 సినిమాలు కూడ పూర్తి చేయలేకపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనికి కారణం అతడు తన సినిమా గురించి కథ రాయడానికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటాడు అన్న ప్రచారం ఉంది. నాగచైతన్య సాయి పల్లవి లతో తీసిన ‘లవ్ స్టోరీ’ మూవీకి ప్రశంసలు లభించినప్పటికీ ఆమూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దీనితో శేఖర్ కమ్ముల స్పీడ్ కు మళ్ళీ బ్రేక్ పడింది.


ఈ మూవీని తీసిన నిర్మాతలు ధనుష్ తో తెలుగు తమిళ భాషలలొ ఒక మూవీని తీయాలని ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ధనుష్ కు కూడ తెలుగులో తన మార్కెట్ పెంచుకోవడానికి ఒక మంచి దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కొంతకాలం క్రితం శేఖర్ కమ్ముల ధనుష్ ను కలిసి ఒక కథను చెప్పడం దానికి ధనుష్ ఓకె చేయడం జరిగినప్పటికీ ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి కావడానికి చాల సమయం పట్టింది.


ఈ కథకు సంబంధించి ధనుష్ పాత్రతో పాటు మరొక కీలక పాత్ర కూడ శేఖర్ కమ్ముల ఆలోచనలలో వచ్చింది అని అంటారు. ఆ ప్రత్యేక పాత్రకు నాగార్జున అయితే అన్ని విధాల సరిపోతాడని భావించడంతో శేఖర్ నాగ్ ను కలవడం ఈ మూవీ కథను చెప్పడం జరిగింది అని అంటున్నారు. ‘మాష్టార్’ మూవీ తరువాత ధనుష్ కు టాలీవుడ్ ప్రేక్షకులతో కూడ మంచి అనుబంధం ఏర్పడింది.


ప్రస్తుతం మల్టీ స్టారర్ ల హవా కొనసాగుతున్న పరిస్థితులలో నాగార్జున ధనుష్ ల కాంబినేషన్ లో మూవీ అంటే మంచి క్రేజ్ ఉంటుందని శేఖర్ ఆలోచన అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో రష్మిక ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్. నాగ్ ఈసినిమాలో 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక పెద్ద తరహా పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: