దేవుడి పాత్రలపై షాకింగ్ కామెంట్స్ చేసిన వివేక్ అగ్నిహోత్రి..!!

Divya
కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రంతో ఒక సంచలనాలని సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్ర ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఫెయిల్యూర్ పైన స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది.. తాజాగా ఒక బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ.. ఆది పురుష్ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అనే విషయంపై ప్రశ్నించగా.. ఈ విషయంపై స్పందిస్తూ ఆది పురుష మేకర్స్ తో పాటు యాక్టర్స్ పైన పెను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.


ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు కూడా నడుస్తున్నాయి కదా అని ఏమాత్రం పూర్తి నమ్మకం లేకుండా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.. పురాణ గాధలకు సంబంధించి చిత్రాలను చేయాలనుకున్నప్పుడు అందులో 100% పట్టు ఉండాలి లేకపోతే గతంలో అలాంటి సినిమాలు తీసిన ప్రాధాన్యత అయిన ఉండాలి అని తెలిపారు.. కానీ మన ఇండియాలో ఇలాంటి నియమాలను ఎవరు కూడా ఫాలో అవ్వారంటు కూడా వివేకాగ్నిహోత్రి తెలియజేశారు.


అంతేకాకుండా రామాయణం మహాభారతం భగవద్గీతలో ఎవరు మనకు చెప్పకపోయినా సరే మన మెదడులో ఎంతో కొంత ఉండని ఉంటుంది.. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరు పడితే వారు తెరమీద కనపడి నేను దేవుడిని అంటే సరిపోదు.. రాత్రంతా తాగి పొద్దున్నే ఆన్ స్క్రీన్ మీదకు వచ్చి నేను దేవుడిని అంటే నమ్మే రోజులు ఇవి కావు అంటూ తెలియజేశారు.. జనాలంతా మూర్ఖులు కాదని కూడా వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ పైన పరోక్షంగా కామెంట్లు చేయడం జరిగింది. అయితే వివేక్ అగ్నిహోత్రి ఎవరిని ఉద్దేశించి చేశారు తెలియకపోవడం జరుగుతోంది.. ఆయన చేసిన కామెంట్లు మాత్రం ఆది పురుష్ మేకర్స్ తో పాటు యాక్టర్స్ పైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: