తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి బాలకృష్ణ ... రవితేజ ... నాని లకి సంబంధించిన మూవీ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. దీనికి సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రదేశంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మొదటి సారి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ రవితేజ ... అనుపమ పై సెవెన్ ఎకర్స్ లో షూటింగ్ నిర్వహిస్తోంది.
నాచురల్ స్టార్ నాని హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా సౌర్యవ్ దర్శకత్వంలో ప్రస్తుతం హాయ్ నాన్న అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాని పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.