బాలీవుడ్ లో తాప్సీ రెచ్చిపోవడానికి కారణం అదేనా....??

murali krishna
అదేంటో తెలియదు కానీ కొందరు హీరోయిన్స్ టాలీవుడ్లో కండిషన్స్ పెట్టి బాలీవుడ్ లో మాత్రం బాగా చెలరేగిపోతూ ఉంటారు. ఇప్పటికి చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి ఇక్కడ చేయని పనులని అక్కడ చేశారు.అయితే ఆ మధ్యనే అడుగు పెట్టిన తాప్సీ కూడా అక్కడ బరితెగించి రెచ్చిపోతుంది. మరి ఈ బ్యూటీ అక్కడ రెచ్చిపోవడానికి కారణం ఒకటుందని తెలిసింది. ఇంతకు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. తన నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది.అంతేకాకుండా తన అందాలతో కూడా ఎంతోమంది కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది. ఇక తాప్సీ 2010లో ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక 2011లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై అక్కడ కూడా మంచి సక్సెస్ లను అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండగా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో తన ఖాతా నింపుకుంటుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది. తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్ డేట్ లను బాగా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బాగా వర్కౌట్ లు చేసి సన్నబడింది. అవకాశాల కోసం మరింత గ్లామర్ షో చేస్తుంది.

ఇప్పుడు టాలీవుడ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు అక్కడే సెటిల్ అయింది. అయితే టాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ లో నటించడానికి దర్శక నిర్మాతలకు కండిషన్స్ పెట్టినట్టు తెలిసింది.కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిపోయిందో ఇక అక్కడ టాలీవుడ్ లో పెట్టిన కండిషన్స్ అన్ని మర్చిపోయి బోల్డ్ కంటెంట్ ఇవ్వటానికి కూడా సిద్ధమయింది. అంతేకాదు బూతు మాటలు కూడా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా మాట్లాడేస్తుంది.మరి బాలీవుడ్ లో ఇంతలా రెచ్చిపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు ఎలా ఉన్నా ఆదరిస్తారు. కానీ బాలీవుడ్ లో అలా కాదు.పైగా అక్కడి డైరెక్టర్ లు కచ్చితంగా బోల్డ్ కంటెంట్ ఇవ్వాలని కండిషన్స్ పెడతారని.. అలా నటిస్తేనే బాలీవుడ్ జనాలు లైక్ చేస్తారని తాప్సీ ఆ ఉద్దేశంతో బాలీవుడ్ లో రెచ్చిపోతుంది. కేవలం తాప్సీ యే కాదు మిగతా హీరోయిన్స్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: