ఆమె కారణంగా మహేష్ బాబు తో గొడవ పడిన నమ్రతా....!!
ఇక అసలు విషయం ఏమిటంటే.. మహేష్ బాబు నమ్రత 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఇక వీరు పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత హీరోయిన్ త్రిష వల్ల నమ్రత కి ఓ విషయంలో కోపం వచ్చిందట.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.నమ్రత మహేష్ బాబు ఇద్దరూ వంశీ సినిమా టైం లో లవ్ లో పడి చాలా సంవత్సరాలు వారి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. అయితే 2005లో వీరి పెళ్లి జరగడం కంటే ముందే అతడు సినిమా లో మహేష్ బాబు కి జోడిగా త్రిష నటించింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబు త్రిష కాంబినేషన్ లో సైనికుడు సినిమా వచ్చింది.ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటంటే..ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో చేస్తే కచ్చితంగా వారి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ గుప్పుమంటాయి. అలాంటిదే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా జరిగిందట.అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్, విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట. కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట. అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.