బిగ్ బాస్ లోకి వెళ్లడంపై.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన వర్ష?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ఆరు సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లోనూ ప్రేక్షకులకు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచేందుకు అటు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంతగానో ప్రయత్నించారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఒక్కో సీజన్ పై రొటీన్ గా ఉంది అంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి విమర్శలను దాటుకుంటూ ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తూ ఉంది బిగ్ బాస్ కార్యక్రమం. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే బిగ్ బాస్ ఏడవ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా తప్పుకుంటారు అని ప్రచారం జరిగినప్పటికీ.. ఇటీవల విడుదలైన ప్రోమోలో మరోసారి నాగ్ కనిపించడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ ప్రోమో విడుదలైన నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే సెలబ్రిటీలు ఎవరు అనే విషయంపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి ప్రతి సీజన్లో ఒకరు లేదా ఇద్దరు కంటెస్టెంట్ గా వెళుతూ ఉన్నారు అని చెప్పాలి. బిగ్ బాస్ 7వ సీజన్లో హౌస్ లోకి వెళ్ళిపోతున్నారు అంటూ కొంతమంది పేర్లు తెరమీదికి వస్తూ ఉన్నాయి. ఇలా బాగా ప్రచారంలో ఉన్న పేర్లలో అటు జబర్దస్త్ లేడి కమెడియన్ వర్ష పేరు కూడా ఉంది అని చెప్పాలి.


 అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లడం గురించి ఇటీవల వర్ష స్వయంగా స్పందించింది . తనకు అవకాశాలు వస్తున్నాయని కానీ హీరోయిన్గా చేయాలని లేదని అక్క వదిన చెల్లి పాత్రలో మాత్రమే నటిస్తా  అంటూ చెప్పుకొచ్చింది. అలాగే త్వరలో ఒక షోలో పాల్గొనబోతున్నాను  ఇక అక్కడ నా జీవితంలో జరిగిన మంచి.. ఏం చదువుకున్నాను అన్ని విషయాలను చెబుతాను అంటూ తెలిపింది వర్ష. దీంతో ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వర్షా  వెళ్ళపోతుంది అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పాలి. వర్షా తో పాటు బుల్లెట్ భాస్కర్ పేరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్లిపోతున్నాడంటూ గట్టిగానే వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: