బిగ్ బాస్ లోకి.. జబర్దస్త్ టాప్ కమెడియన్.. ఇక ఎంటర్టైన్మెంట్ కి డోకా లేదు?

praveen
తెలుగు బుల్లితెరపై మళ్లీ బిగ్ బాస్ హంగామా మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు సోషల్ మీడియాలో ప్రోమోలు విడుదలవుతూ బిగ్ బాస్ ఏడవ సీజన్ పై అంచనాలు పెంచేస్తున్నాయ్. ఇప్పటికే ఆరు సీజన్లు ఎంతో సక్సెస్ఫుల్గా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచాయి అన్న విషయం తెలిసిందే.  ఇక గత సీజన్లో వచ్చిన విమర్శలను సరిదిద్దుకుంటూ కంటెస్టెంట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ బిగ్ బాస్ నిర్వాహకుల ముందుకు సాగుతూ ఉన్నారు.


 అయితే ఈసారి బిగ్ బాస్ ఏడవ సీజన్ మరింత సరికొత్తగా ఉండబోతుంది అని అటు నాగార్జున కూడా బల్లగుద్ది మరీ చెబుతూ ఉన్నాడు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ ఏడవ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైన నేపథ్యంలో ఇక హౌస్ లోకి కన్టెస్టెంట్ గా వెళ్లబోయే వారు ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు తెరమీదకి వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ ఒకరు బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది


 అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కూడా జబర్దస్త్ నుంచి ఒక కమెడియన్ ను  హౌస్ లోకి పంపించడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఏడవ సీజన్లో కూడా జబర్దస్త్ లో టాప్ కమెడియన్గా కొనసాగుతున్న బుల్లెట్ భాస్కర్ ను ఇక హౌస్ లోకి పంపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా బుల్లెట్ భాస్కర్ అటు జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతూ తనదైన స్కిట్లతో.. ప్రేక్షకులను అదరిస్తున్నాడు. అయితే బుల్లెట్ భాస్కర్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు అటు డబ్బింగ్ ఆర్టిస్ట్.. మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. దీంతో అతను హౌస్ లోకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ మరో రేంజ్ లో ఉంటుందని అటు ఫాన్స్ కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: