అమ్మాయి వదిలేయడంతో.. మందుకి బానిసైన హైపర్ ఆది!
తాజాగా ఢీషో ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో దీపిక పిల్లి అఖిల్ ని తీసుకొని స్టేజ్ పైకి రావడంతో ప్రదీప్ ఎవడీడు అని అడుగుతాడు. దీపిక మాట్లాడుతూ ఈయన మా బావ అని చెబుతుంది. వెంటనే శేఖర్ మాస్టర్ మరి ఇంకొకడు ఎక్కడ అని అడగగానే హైపర్ ఆది మందు బాటిల్ తీసుకొని స్టేజి పైకి వస్తాడు. అది చూసిన శేఖర్ మాస్టర్, ఇలా మందు బాటిల్ పట్టుకొని స్టేజ్ పైకి వస్తావా? అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో అసలు నీ ప్రాబ్లెమ్ ఏంటి అని శేఖర్ మాస్టర్ నే అడుగుతాడు. ఈ మాటలకు షాకైన శేఖర్ మాస్టర్, ఫస్ట్ టైం తాగినట్టు ఉన్నావ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ రిప్లై ఇస్తాడు.
వెంటనే ఆది మాట్లాడుతూ, ఎవరికోయ్ ఫస్ట్ టైం, ఐదు సీజన్ ల నుంచి తాగుతున్న, నీకేం తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. వెంటనే సెట్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. అయితే ఇది కామెడీ కాదని, దీపిక పిల్లిని నమ్ముడివడంతోనే ఇలా జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.