ఆ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణం అల్లుఅర్జున్...??
అయితే ఆమెకి ఇండస్ట్రీ లో సక్సెస్ రేటు లేకపోవడం, కొత్త హీరోయిన్ల పోటీ వల్ల తక్కువ సమయంలో గౌరీ ముంజాల్ ఫేడౌట్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. అయితే గౌరీ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ప్రస్తుతం గౌరీ ముంజాల్ ఫ్యామిలీతో కలిసి ఢిల్లీలో ఉంటోంది. అక్కడే స్థిరపడ్డ ఈ అందాల సోయగం.. సినిమా ఆఫర్లు రాకపోవడం వల్ల ఏవో వ్యాపారాలు చూసుకుంటుంది.
అయితే గౌరీ ముంజాల్ కు ఇంత వరకు పెళ్లి కాలేదు. వయసు 40కి చేరువైనా ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టపోవడం గమనార్హం. ఇక హీరోయిన్లు సినిమాలకు దూరమైతే గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. కానీ, గౌరీ ముంజాల్ మాత్రం ఇప్పటికీ తన గ్లామర్ ను చక్కగా మెయింటైన్ చేస్తోంది. అలాగే ఫిజిక్ ను బాగానే కాపాడుకుంటూ వచ్చింది. ఒకవేళ ఈమె సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే సహాయక పాత్రలకు చక్కని ఎంపిక అవుతుంది. మరి గౌరీకి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియాల్సి ఉంది.
ఇలాగే ఈమె తో పాటు అల్లు అర్జున్ తో ఆర్య సినిమా లో నటించిన హీరోయిన్ అయిన అను మెహతా కూడా ఇండస్ట్రీ నుంచి దూరం అయింపోయింది.సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అయింది అయిన కూడా అను కి పెద్దగా ఆఫర్స్ రాలేదు అల్లరి నరేష్ తో నువ్వంటే నాకిష్టం అనే సినిమా లో నటించినప్పటికీ ఆ తర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు.
ఇక అలాగే గుణశేఖర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు సినిమాలో హీరోయిన్ గా చేసిన భాను మెహ్రా కూడా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది ఇక దాంతో ఆమె ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయింది.ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ ఏదైనా కొత్త హీరోయిన్ తో చేస్తున్నాడు అంటే ఆమె కి ఇండస్ట్రీ లో తర్వాత అవకాశాలు రావు అనే చెప్పాలి.