మహావీరుడు ఓటిటి లో వచ్చేది అప్పుడే..!!

Divya
తమిళ హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్నది.. అలా సూర్య, విక్రమ్, విజయ్, అజిత్ శివ కార్తికేయన్ తదితర హీరోలు ఉన్నారని చెప్పవచ్చు. ఇక తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైర్మెంట్ చేస్తూ ఉంటాడు నటుడు శివ కార్తికేయన్ రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు నేరుగా తెలుగు సినిమాలను కూడా చేశారు. తాజాగా ఆయన నటించిన మహావీరుడు సినిమా ఇటీవలే విడుదలై.. అప్పుడే ఓటీటి లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్ గతంలో నటించిన వరుణ్ డాక్టర్ ,కాలేజీ డేస్ ,ప్రిన్స్ మూవీలో తెలుగు రాష్ట్రాలలో బాగానే అలరించాయి .తమిళంలో మావిరన్.. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రాన్ని మోడల్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇందులో డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే సరిత, యోగి బాబు కూడా కీలకమైన పాత్రలో నటించారు.. యాక్షన్ కామెడీ ఫాంటసీ చిత్రంతో మహావీరుడు సినిమా జులై 14న విడుదలయ్యింది అయితే తమిళంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మహావీరుడు చిత్రం తెలుగులో మాత్రం కలెక్షన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ చిత్రంలో తెలుగు వర్షన్ కోసం హీరో రవితేజ డబ్బింగ్ చెప్పడం విశేషం సునీల్ సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రిమ్మింగ్ రైట్స్ విడుదల తేదీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మహావీరుడు చిత్రాన్ని ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ  33 కోట్ల రూపాయలు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయ నటించిన చిత్రాలలో ఈ సినిమాని అత్యధిక ధరకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది.. ఆగస్టు నెల ఆఖరిలో ఈ సినిమా ఓటీటి లో స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరి ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: