మరొకసారి విడాకులపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల..!!
రాజీవ్ మాట్లాడుతూ.. విడాకుల వార్తలు నాకు కొత్త కాదు. నేను సుమ విడిపోతున్నామని చాలా సంవత్సరాల నుంచి ప్రచారం జరుగుతుంది. మాకే విసుగు వస్తోంది .ఈ వార్తలు నిజం కాదని.. మరొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నేను సుమ హోస్టుగా చేస్తున్న షోలకి వెళుతున్నాము ఈ మధ్యనే కలసి అమెరికాకు కూడా వెళ్లొచ్చామని తెలియజేశారు. అక్కడ రీల్స్ కూడా చేసి సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేశాము మేము కలిసే ఉన్నామని చెప్పడానికి ఇంతకుమించి ఏం చేయాలో మాకు అర్థం కావలెదని తెలిపారు.
ఇలాంటి రూమర్స్ తమకు అలవాటైందని తెలియజేశారు అయిన ఇలాంటి వార్తలు వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మా పిల్లలు స్కూల్లలో, కాలేజీలో, ఫ్రెండ్స్.. అందరూ మీ పేరెంట్స్ విడిపోతున్నారంట కదా అని అడుగుతున్నారు.. ఇలా వార్తలు విని చాలా రకాలుగా మమ్మల్ని తిట్టారని తెలియజేశారు. మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే మా విడాకుల వార్తలను ఇకమీదట ఆపివేస్తే బాగుంటుంది అంటూ రాజీవ్ కనకాల కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం సుమ రాజీవ్ కనకాల విడాకులు వ్యవహారంపై క్లారిటీ ఇవ్వడంతో అటు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇకమీదటైనా ఈ వార్తలకు పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.