7G బృందావన్ కాలనీ హీరో.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడో చూడండి?

praveen
7G బృందావన్ కాలనీ.. ఈ సినిమాని ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే అంతలా ఈ సినిమా ప్రతి ఒక్కరి హార్ట్ కి కనెక్ట్ అయింది అని చెప్పాలి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాలో చంద్రమోహన్, సుధా,  సుమన్ శెట్టి తదితరులు కీలక పాత్ర పోషించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎం ఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు అని చెప్పాలి. ఈ సినిమాకు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజ సంగీతం అందించారు.


 2004లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయనగ సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది ఈ సినిమా. ముఖ్యంగా యూత్ కి అయితే ఈ సినిమా స్టోరీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది అని చెప్పాలి. ఇప్పటికి కూడా యూత్ అందరికీ ఈ సినిమా ఫేవరెట్ గానే కొనసాగుతుంది.  అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన రవి కృష్ణకు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత అవకాశాలు వస్తాయి అని అందరూ అనుకున్నారు.


 కానీ ఆ తర్వాత అడపాదడప అవకాశాలు అందుకుని కేవలం కొన్నాళ్లే ఇండస్ట్రీలో కొనసాగాడు రవికృష్ణ. ఈ రవి కృష్ణ ఎవరో కాదు నిర్మాత ఎంఎం రత్నం తనయుడు. అయితే తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అనుకున్నాడు రవికృష్ణ. తర్వాత తెలుగులో బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు వంటి సినిమాలు చేశాడు. కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో రవి కృష్ణ పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు. తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకున్న అక్కడ అతనికి దురదృష్టం వెంటాడింది. అయితే రవికృష్ణ ఇప్పుడు ఎంతగానో మారిపోయాడు. ఏకంగా లావు అయ్యాడు. ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడుతన ఫోటోలను పంచుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: