రవితేజ సరసన పూజ హెగ్డే.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

praveen
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందె. అయితే హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇక దూసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎందుకో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.


 అయినప్పటికీ ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు ఈగల్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటూ ఉన్నాడు రవితేజ. అయితే ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో.. గోపీచంద్ మలినేని తో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి అన్న విషయం తెలిసిందే. అయితే క్రాక్ సినిమాతో రవితేజకు ఒక సాలిడ్ హిట్ను అందించాడు గోపీచంద్ మలినేని.


 అయితే ఇక తన లక్కీ డైరెక్టర్ గా పేరు ఉన్న గోపీచంద్ మలినేని తో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు రవితేజ. కాగా ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ చక చక సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక అన్ని కుదిరితే ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశం ఉంది అని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో సినిమాలేవి చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రవితేజ సినిమా కోసం ఈ అమ్మడిని సంప్రదించినట్లు సమాచారం. ఓకే చెప్పిందంటే వీరి కాంబినేషన్ మొదటిసారి రిపీట్ అవుతుంది అని చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: