"భోళా శంకర్" మూవీ నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఏ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుండగా ... సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 


ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను విడుదల చేసింది  వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మూడవ పాటకు సంబంధించిన విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటించింది.


తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మూడవ సాంగ్ అయినటువంటి "మిల్కీ బ్యూటీ" అంటూ సాగే పాటను ఈ రోజు సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో చిరంజీవి మరియు తమన్నా  లు అదిరిపోయే స్టైలిష్ స్టెప్ లు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: