అతనికి తప్ప వేరేవాళ్లకి లిప్ లాక్ ఇవ్వనంటున్న కీర్తి సురేష్...!!
అయితే కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక కొన్నిసార్లు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అలా చేసి హిట్టు కొట్టిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు అలా కాకుండా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అటు ఇటు కాకుండా క్రేజీ కండిషన్స్ తో మధ్యలో నలిగిపోతుంది కీర్తి సురేష్. రీసెంట్గా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తను స్క్రీన్ పై ఎవరితో రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందో అనే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ రిపోర్టర్ మీరు లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు, ఏ హీరోతో ఇష్టపడతారు అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు. దీనికి బదులుగా కీర్తి సురేష్ ఏ హీరోతో చేయను నా భర్తకి తప్పితే వేరే వాళ్ళకి లిప్ లాక్ ఇవ్వను అంటూ చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే కీర్తి సురేష్ ఏ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయనట్లు కనిపిస్తుంది.