పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు వాటిని గిఫ్ట్ గా ఇచ్చిన సితార....!!
బ్యాగ్రౌండ్ తో సంబంధం లేకుండా తన టాలెంట్ తో సితార స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ లో యువతులతో కలిసి సితార పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేయడం తో పాటు పింక్ కలర్ లో ఉన్న సైకిళ్లను సితార గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. పీఎంజే జ్యూవెలరీ యాడ్ లో సితార నటించగా ఈ యాడ్ సితార కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సితార కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సితార కు సినిమా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం లో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. సితార రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.