త్రివిక్రమ్ ఎంట్రీతో.. బ్రో సినిమా కథ మొత్తం మారింది : సముద్రఖిని

praveen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్రో సినిమా గురించి  మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఈ సినిమా సముద్రఖిని దర్శకత్వంలో తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.  జూలై 28వ తేదీన థియేటర్లలో ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ప్రస్తుతం రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో  చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బ్రో చిత్ర బృందం ప్రమోషన్స్ లో కనిపిస్తూ ఉన్నారు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బ్రో సినిమా దర్శకుడు నటుడు సముద్రఖని పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. అసలు బ్రో సినిమా ఎలా స్టార్ట్ అయింది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు ఎలా వెళ్ళింది అంటూ యాంకర్ ప్రశ్నించారు. దీనికి సముద్రఖిని ఆసక్తికర సమాధానం చెప్పాడు.  బ్రో సినిమా తమిళ మూవీ వినోదాయ సీతం సినిమాకు రీమేక్.


 అయితే ఒరిజినల్ మూవీ 100 మినిట్స్ మాత్రమే ఉండే ఒక కథ. అయితే ఈ సినిమా రిలీజ్ చేసే సమయానికి నేను తెలుగులో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నా. ఇక ఆ సమయంలోనే త్రివిక్రమ్ కి నాకు మధ్య నేను నటించిన వినోదాయ సీతం సినిమా గురించిన ప్రస్తావన వచ్చింది. దీంతో రెండు నిమిషాల్లో ఆయనకు కథను వివరించాను. నాకు కథ నచ్చింది. వెంటనే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లేను సెట్ చేసి.. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ హీరోలు మనం తెలుగులో రీమేక్ చేస్తున్నాం అంటూ త్రివిక్రమ్  చెప్పారు.  దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యా. ఇలా రెండు నిమిషాల్లోనే కథ మొత్తం మారిపోయి బ్రో సినిమా సెట్ అయింది అంటూ సముద్రఖిని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bro

సంబంధిత వార్తలు: