పవన్ మ్యానియా పై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్ !

Seetha Sailaja
ఒక యంగ్ హీరోయిన్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆప్రొడక్షన్ హౌస్ కు ఉన్న పేరు రీత్యా లేదంటే దర్శకుడుకి ఉన్న క్రేజ్ రీత్యా తన పాత్ర ఎలా ఉన్నప్పటికీ మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకుంటూ ఉంటారు. అయితే యంగ్ హీరోయిన్ కేతిక శర్మ తాను కేవలం పవన్ కళ్యాణ్ ను కలవడం కోసమే తాను ‘బ్రో’ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను అని అంటోంది.


"పవన్ కళ్యాణ్ కోసమే ఒప్పుకున్నాను. ఆయన పేరు వింటే చాలు.. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. నిజానికి సినిమాలో నాకు, పవన్ కళ్యాణ్ కు కాంబినేషన్ సీన్లు లేవు. కానీ ఆయన నటించిన సినిమాలో ఉండడం నాకు సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ ని అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించింది. అది చాలు నాకు." అంటూ ఈ బ్యూటీ భావోద్వేగానికి లోనైంది.


‘బ్రో’ సెట్ లోకి అడుగుపెట్టగానే తాను పవన్ కళ్యాణ్ ను చూసి మాట్లాడటానికి కూడ భయపడిన విషయాన్ని బయటపెడుతూ ఆ స్థితిలో తాను సాయి ధరమ్ తేజ్ సహాయం తీసుకుని పవన్ కళ్యాణ్ ను కలిసిన సందర్భాన్ని వివరించింది. తేజ్ తనను పరిచయం చేయగానే పవన్ ఎటువంటి ఇగో లేకుండా తనను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా తన ఇంటి మనిషి లా తన యోగక్షేమాల గురించి అడిగిన సందర్భాన్ని తాను జీవితంలో మర్చిపోలేను అని అంటోంది.


భారీ అంచనాలు ఉన్న ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ వారాంతంలో జరగబోతోంది. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణ రీత్యా ఈఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ఎవర్నీ పిలవకుండా ఈ ఫంక్షన్ ను నిర్వహించాలని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు తప్ప టాప్ హీరోల సినిమాలు విడుదలలేని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయం అన్నమాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: