సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రష్మీ స్క్రీన్ షాట్ వీడియో...!!
మెగాస్టార్ తాజాగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆమె నటిస్తోందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే అందులో ఎటువంటి పాత్రలో కనిపిస్తుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.అయితే అందుకు సమాధానంగా ఇటీవల చిరు లీక్స్‌లో తెలిసిపోయింది. చిరు లీక్స్ పేరుతో చిరంజీవి ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. అందులో పవన్ కల్యాణ్ మేనరిజాన్ని సినిమాలో అనుకరించినట్లు తెలిపారు. అయితే ఆ లీక్‌తో పాటు మరో లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదే రష్మి వీడియో. ఆ వీడియోలో తళుక్కున మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ వీడియో స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ ఖుషీ మూవీలోని యే మేరా జహా పాటకు చిరు స్టెప్స్ వేస్తూ ఆ లీక్ వీడియోలో చిరంజీవి కనిపించారు. అయితే అందులో చిరంజీవి పక్కన రష్మి కూడా ఉంది.పొట్టి దుస్తులు వేసుకొని చేతికి హ్యాండ్ బాగ్ తగిలించుకొని చాలా స్టైలిష్ గా కనిపించింది రష్మీ. ఇకపోతే ఇప్పటికే భోళా శంకర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయినా విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు చిత్రబృందం కూడా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టే ఆలోచనలు చేస్తోంది. కాగా ఇందుయే చిరంజీవి సరసన తమన్నా నటించిన ఈ మూవీలో కీర్తి సురేశ్ ఆయన చెల్లెలి పాత్ర పోషించింది.