బేబీ మ్యానియా దేనికి సంకేతం !

Seetha Sailaja
గతవారం విడుదలైన చిన్నసినిమా ‘బేబి’ మ్యానియాను చూసి ఇండస్ట్రీవర్గాలు షాక్ అవుతున్నాయి. కేవలం మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ కు వచ్చిన ఈ మూవీ తన టోటల్ రన్ పూర్తి చేసుకునేసరికి ఈమూవీ కలక్షన్స్ ఏస్థాయికి చేరుకుంటాయో ఇండస్ట్రీలో తలలుపండిన వారికి కూడ అంతుచిక్కడం లేదు అని అంటున్నారు.


మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో ఈసినిమాకు ఎక్స్ ట్రా షోలు వేయడం చూసి చాలమంది ఆశ్చర్య పోతున్నారు. జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీకి వచ్చి తమ క్లాసులు ఎగ్గొట్టి గుంపులు గుంపులుగా ధియటర్ కు వెళ్ళి ‘బేబి’ సినిమాను చూస్తున్న సంఘటన చూసినవారు. ధియేటర్లకు మంచిరోజులు వచ్చాయా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా ఈసినిమా యూత్ కు కనెక్ట్ కావడానికి కొన్ని ఆశక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.


క్లాసు మాస్ అన్న తేడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈసినిమాను చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను ప్రేమలో ఉన్న వాళ్ళు  బ్రేకప్ లవర్స్ ఫ్రెష్ గా లవ్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళు ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఈసినిమాను చూస్తున్నారు. ఈసినిమాలో కొంత బొల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ విజయ్ బుల్గానిన్ సంగీతం వైష్ణవి నటన ఆనంద్ పాత్ర ఇంటర్వెల్ ట్విస్ట్ రాత్రి వేళ బిల్డింగ్ పైన హీరో హీరోయిన్ తిట్టుకునే సన్నివేశం ప్రేమిస్తున్నా పాట ఇలా ప్రతి సీన్ కు ఈసినిమా చూస్తున్నవారు కనెక్ట్ అవుతున్నారు.


యూత్ లో చాలామంది తమ నిజ జీవితానికి దగ్గరగా ఉన్న సంఘటనలకు దగ్గరగా ఈసినిమా ఉంది అని భావిస్తూ ఉండటంతో ఈసినిమాకు ఈ రేంజ్ లో సూపర్ హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఈమూవీ మ్యానియా మరొక 10 రోజులు కొనసాగే ఆస్కారం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసినిమాను మొదట్లో కొందామని అనుకుని మిస్ అయిన బయ్యర్లు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యామని భావిస్తే ఈసినిమాను అతితక్కువ రేట్లకు కొన్న బయ్యర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: