హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో విషాదం..!!

Divya
అలా మొదలైంది సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ నిత్యమీనన్. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నిత్యా మీనన్ తాజాగా ఇమే ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోయినట్లు ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ బాగోద్వేగానికి గురైంది. తన అమ్మమ్మతో కలిసి ఉన్న ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఒక శకం ముగిసింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్ ఇప్పటినుంచి మరో కోణంలో చూసుకుంటా అంటూ ఎమోషనల్ అయింది నిత్య మీనన్..
నిత్య మీనన్ పంచుకున్న ఫోటోలు అమ్మమ్మతో పాటు తన తాతయ్య కూడా పక్కన ఉన్నారు. నిత్య నీ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళ అమ్మమ్మ వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కి ఈ ఫోటో నిదర్శనం అని కూడా చెప్పవచ్చు. నిత్య షేర్ చేసిన ఈ ఫోటోపై అభిమానులు స్పందిస్తూ ధైర్యంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే నిత్యామీనన్ తెలుగులో బీమ్లా నాయక్ చిత్రంలో నటించింది పవన్ కు జోడిగా నటించిన ఈమె ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది.
నిత్యామీనన్ కెరియర్ లో జనతా గ్యారేజ్, ఇష్క్, గుండెజారి గల్లంతయింది, తదితర చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన కెరియర్ లో ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటించింది నిత్యామీనన్. ముఖ్యంగా ఎక్కువగా ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలలోనే నటించి మెప్పించింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు కానీ మలయాళం తమిళంలో మాత్రం నటిస్తూ బిజీగా ఉంటోంది నిత్యామీనన్. ప్రస్తుతం నిస్త్య మీనన్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: