మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఈ
మూవీ లో
పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటించింది. జగపతి బాబు ,
ప్రకాష్ రాజ్ ,
అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ
సినిమా 2018 వ సంవత్సరం తెలుగు భాషలో విడుదల అయ్యి భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి నాన్
బాహుబలి రికార్డ్ లను సృష్టించింది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తాజాగా జూలై 14 వ తేదీన
జపాన్ లి విడుదల చేశారు.
ఇకపోతే
జపాన్ లో ఈ
మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి
జపాన్ లో విడుదల అయిన సినిమాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ విషయాన్ని మైత్రి సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.