ఆ కారణంగా రానా కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నటుడు నవదీప్...!!
ఇక ఇప్పటికే ఈ సీరియస్ నుంచి విడుదలైనటు వంటి పోస్టర్, ట్రైలర్ పెద్ద ఎత్తున అందరిని ఆకట్టుకుంది. తాజా గా నిర్వహించిన ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఒకప్పుడు పల్లెటూర్లో ప్రజలందరూ సాయంత్రం అయితే ఒకచోట కూర్చొని ఎంతో సరదా గా ముచ్చట్లు పెట్టుకునే వారు. ఈ సిరీస్ లో కూడా అలాంటి కథాంశాలను డైరెక్టర్ చాలా అద్భుతం గా చూపించారని నవదీప్ తెలిపారు. ఎప్పుడో రామానాయుడు గారు మొదలు పెట్టిన ఓ అఖండ దీపాన్ని ఎంతో విజయవంతం గా ముందుకు తీసుకు వెళుతూ యంగ్ టీమ్, యంగ్ ప్రొడక్షన్ ను తెర పైకి తీసుకు వస్తున్న మా రానా కు ఆల్ ద బెస్ట్ అంటూ ఈ సందర్భం గా నవదీప్ రానా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.