టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో నిఖిల్ ఒకరు. ఈ నటుడు హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "స్పై" అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది.
దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలక్షన్ లను కూడా రాబట్ట లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ రెండు భారీ బడ్జెట్ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువ నటుడు ది ఇండియా హౌస్ ... స్వయంభు అనే సినిమా లలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లు సెట్స్ పై ఉండగానే మరో దర్శకుడు ని కూడా ఈ యువ హీరో లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీ ల తర్వాత నిఖిల్ ... విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా రూపొంది అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విఐ ఆనంద్ ... సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఊరి పేరు భైరవకోన అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.