బ్లాక్ బస్టర్ హిట్ సామజవరగమన చిత్రం ఓటీటి లో..?
స్టార్ హీరోల చిత్రమైన యంగ్ హీరోల చిత్రమైన కొత్త హీరోల చిత్రమైన సరే కామెడీ జోనర్లో సినిమా హిట్ అయిందంటే ఇక ఆ సినిమాకి కలెక్షన్లు భారీగానే వస్తూ ఉంటాయి.. కేవలం రూ.7కోట్ల రూపాయలతో తీసిన సామజవరగమన సినిమా.. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లో విడుదలై తొలి రెండు రోజులలోనే అంతంతమాత్రంగా ఉన్న ఈ సినిమా ఒక్కసారిగా శనివారం నుంచి మరింత క్రేజ్ సంపాదించుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా మూడింతల లాభంతో కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా థియేటర్లో సక్సెస్ఫుల్గా సాగుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 22 లేదా 25 నుంచి ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆల్రెడీ ఈ సినిమాని థియేటర్లో చూసినవారు కూడా మళ్లీ ఓటీటి లో చూసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో శ్రీ విష్ణు మళ్లీ కం బ్యాక్ ఇచ్చారని కూడా చెప్పవచ్చు. అఫీషియల్ గా సామజ వరగమన సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తుందేమో చిత్ర బృందం చూడాలి మరి.