టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' వరల్డ్లోకి అడుగుపెట్టేశారు. తన లుక్ మొత్తం కూడా ఛేంజ్ చేసేశారు.అలాగే దానికి సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.'ది వారియర్' సినిమా డిజాస్టర్ తర్వాత ఆయన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'స్కందా' అనే భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని చేశారు. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.దీంతో హీరో రామ్ తన కొత్త సినిమాపై ఫోకస్ట్ స్టార్ట్ చేసేశారు. పూరి జగన్నాథ్తో కలిసి మరో సినిమా షురూ చేశారు. వీరిద్దరు కలిసి గతంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్గా 'డబుల్ ఇస్మార్ట్' సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా సోమవారం నాడు జులై 10న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.జులై 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.దీంతో హీరో రామ్.. డబుల్ ఇస్మార్ట్ వరల్డ్లోకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు.
పాత లుక్ మాస్ అవతార్గా రెడీ అయ్యారు.హీరో షార్ట్ స్పైక్డ్ హెయిర్ స్టైల్లోకి మారిపోయారు.ఇక తన గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశారు. ఫైనల్గా స్టైలిష్ అండ్ మాస్ అవతార్గా రామ్ చేంజ్ అయిపోయారు.ఇక ఈ సినిమాలో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ ని రామ్ సరసన హీరోయిన్ గా దించబోతున్నారు. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకోనున్నారు.ఇక 'లైగర్' సినిమా డిజాస్టర్తో కెరీర్ డౌన్ స్టేజ్కు వెళ్లిపోయిన పూరి జగన్నాథ్.. ఈ సినిమాని భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ ఉన్న సినిమాగా రూపొందించబోతున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని మహా శివరాత్రి కానుకగా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే సంవత్సరం మార్చి 8న సినిమా విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.