ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు ఎలాంటి విషయాలను దాచకుండా తమ పర్సనల్ విషయాలని సైతం తమ అభిమానులతో పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ పెళ్లి విషయం గర్భిణీ విషయాలని ఏమాత్రం సందేహపడకుండా అధికారికంగా వెల్లడిస్తున్నారు. అయితే చాలామంది హీరోయిన్లు ఇలాంటి ధైర్యం చేయట్లేదు. ఇక మరికొందరేమో ధైర్యంగా ముందుకు వచ్చి తమ వ్యక్తిగత విషయాలను బయటపెడుతున్నారు. అయితే ఈ తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్స్ సైతం ఒక వ్యక్తిని తను ప్రేమికుడిగా పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.
ఇక అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ లో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం యంగ్ హీరోలతోనే నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె. కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఈమె మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. దాని తరువాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ మంచి క్రేజ్ మాత్రం తెచ్చుకోలే లేకపోయింది. అయితే కొన్ని సినిమాల్లో కొన్ని స్పెషల్ సాంగ్స్లో సైతం కనిపించింది ఈమె. నిత్యం తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.
ఎప్పుడు హాట్ గా కనిపించే ఈమె సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికీ తన సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే హెబ్బా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి ఫోటోని షేర్ చేసింది ఆమె ప్రేమికుడిని పరిచయం చేస్తూ అతని కౌగిలించుకొని ముఖాన్ని కప్పేసింది హెబ్బా పటేల్. అయితే ఈ ఫోటో చూసిన వారంతా హెబ్బా పటేల్ చేసిన పనికి షాక్ అవుతున్నారు. అయితే నిజంగా ఆయన హెబ్బా పటేల్ ప్రియుడేన అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..!!