బాహుబలిలో.. ఆ సీన్ మరోలా తీద్దామనుకున్నా : జక్కన్న
రాజమౌళి టేకింగ్ చూసి సినీ ప్రేక్షకులందరూ కూడా మంత్రముగ్దులు అయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు. ఇక రాజమౌళిని పాన్ ఇండియా డైరెక్టర్గా మార్చిన ఈ మూవీ ప్రభాస్ ను అయితే ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా మారేలా చేసింది అని చెప్పాలి. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఏం సినిమా చేయబోతున్నాడు అని సినీ ప్రపంచం మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేలా ప్రభావం చూపించింది ఈ మూవీ. అయితే రాజమౌళి ఏ సన్నివేశం విషయంలో అయినా పూర్తి క్లారిటీతో ఉంటారు. తనకు నచ్చేటట్లుగా టేక్ వస్తేనే ఓకే చెబుతారు. లేదంటే ఎన్ని రీటెక్స్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు.
అలాంటి రాజమౌళి బాహుబలి సినిమాలోని ఒక సన్నివేశాన్ని మాత్రం మరోలా తీయాలని అనుకున్నాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. బాహుబలి సినిమా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బాహుబలి లో ఒక సీన్ ని వేరేలా తీయాలి అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుంది. కానీ మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని దేవసేన అన్నప్పుడు.. ప్రభాస్ నుంచి బాహుబలి రూపం రావాలి.. పంచభూతాల నుంచి దాటుకుంటూ ప్రభాస్ వస్తున్న సీన్ వేరేలా తీద్దామని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.