పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా బ్రో. మామ అల్లుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కాగా నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ అభిమానులు మాత్రం ఈ సినిమాని చూడడానికి తెగ ఆసక్తిగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయనకీ భారీ సంఖ్యలో అభిమానులు ఉంటారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్.
ఇక సాయి తేజ విషయానికి వస్తే ఇటీవల విరూపాక్ష సినిమాతో అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్ ని చూస్తుంటే గతంలో వచ్చిన గోపాల గోపాల సినిమా తరహాలో ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సైతం విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈ పాటలో ఊర్వశి రౌతెల కనిపించడంతో ఈ సాంగ్ అందరికీ బాగా నచ్చింది. అయితే ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా 100 కోట్ల బిజినెస్ చేసింది.
నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా లేదన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లకు ఒకింత టెన్షన్ సైతం స్టార్ట్ అయింది అని అంటున్నారు. అయితే ఈ సినిమా తమిళ్ రీమేక్ కాబట్టి అక్కడ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కచ్చితంగా తెలుగులో సైతం అదే టాక్ మీ సొంతం చేసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అయితే కథ కొత్తగా ఉన్నప్పటికీ అభిమానులు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!