షారుక్ ఖాన్ కి యాక్టింగ్ రాదు.. నటి షాకింగ్ కామెంట్స్?

praveen
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ వున్నాడు షారుక్ ఖాన్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కూడా టాప్ హీరోగా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఎంతోమంది యంగ్ హీరోస్ రాణిస్తున్న షారుఖాన్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అని చెప్పాలి. అయితే కేవలం హిందీలోనే కాదు అటు తెలుగులో కూడా షారుక్ ఖాన్ సుపరిచితుడే. ఇక టాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ అభిమానించే ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి. ఇక షారుక్ ఖాన్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి.


 మొన్నటికి మొన్న పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుక్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎప్పుడూ తన ఫిట్నెస్ ని కాపాడుకుంటూ.. సినిమాల్లో యాక్షన్ సీన్స్ తో అదరగొడుతూ ఉంటాడు. అయితే అలాంటి షారుఖ్ ఖాన్ గురించి ఇటీవలే పాకిస్తాన్ నటి చేసిన కామెంట్స్ కాస్త సంచలనగా మారిపోయాయి అని చెప్పాలి. ఏకంగా స్టార్ హీరో షారుక్ ఖాన్ కి యాక్టింగ్ రాదు అంటూ పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ నటి మనూర్ బరుచ ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.



 అంతేకాదు ఇక ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న షారుక్ ఖాన్ అసలు అందగాడే కాదని.. అతనికి యాక్టింగ్ కూడా రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక రొమాంటిక్ పాత్రలు కూడా షారుక్ ఖాన్ చేయలేడు అంటూ పేర్కొంది ఆమె. సైకో పాత్రకు షారుక్ ఖాన్ సరిగ్గా సరిపోతాడు అంటూ కామెంట్ చేసింది. అయితే పెద్దగా యాక్టింగ్ రాకపోయినప్పటికీ తన సినిమాలకు ఎలా బిజినెస్ చేసుకోవాలో మాత్రం షారుక్ ఖాన్ కి బాగా తెలుసు అంటూ కామెంట్ చేసింది నటి మనూర్ బరుచ. ఇక ఆమె చేసిన కామెంట్స్ పై షారుక్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం పాపులారిటీ కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు షారుక్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: