రీరిలీజ్ కు రెడీ అవుతున్న మహేష్ బాబు 'బిజినెస్ మాన్'....!!
దాదాపు పదేళ్ల కింద 'బిజినెస్ మెన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2012లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టింది. రూ.90 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగులోని హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా ఇక్కడ సూపర్ హిట్ కావడంతో బెంగాలీలోనూ రీమేడ్ చేశారు. ఆర్ఆర్ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఆర్ఆర్ వెంకట్ నిర్మించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా మహేశ్ బాబు - కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత పూరీ - మహేశ్ బాబు కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నా కుదరలేదు. ప్రస్తుతం మహేశ్ బాబు 'గుంటూరు కారం'చిత్రంలో బిజీగా ఉన్నారు. ఇటు పూరీ 'లైగర్' దెబ్బ నుంచి కోలుకునేందుకు 'డబుల్ ఇస్మార్ట్'తో వస్తున్నారు.