మంగళ వారం పై పెరిగిపోతున్న ఆశక్తి !

Seetha Sailaja
ఆర్ ఎక్స్ 100’ మూవీ సూపర్ సక్సస్ అవ్వడంతో ఆమూవీ దర్శకుడు అజయ్ భూపతి టాప్ దర్శకుడుగా మారిపోతాడాని చాలామంది అంచనాలు వేశారు. అయితే ఆ సక్సస్ అజయ్ భూపతికి ఏమాత్రం కలిసిరాలేదు. ఆతరువాత తీసిన అతడి సినిమాలు అంచనాలు అందుకోలేకపోవడంతో అజయ్ భూపతి పేరును ఇప్పుడు చాలామంది మార్చిపోయారు.


ఇలాంటి పరిస్థితులలో ఒక సూపర్ హిట్ కొట్టితీరాలి అన్నపట్టుదలతో ఇప్పుడు అతడు లేటెస్ట్ గా తీసుకున్న ‘మంగళవారం’ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా టైటిల్ తో పాటు ఇప్పటిదాకా విడుదలచేసిన పోస్టర్లు ఆసక్తిగా ఉండటంతో డిఫరెంట్ కాన్సెప్ట్ ను దర్శకుడు చెప్పబోతున్నాడు అన్నఅభిప్రాయం చాలమందిలో కలిగింది.




లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ పై మరింత అంచనాలు పెంచుతున్నాయి. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేస్తున్న ఈమూవీ ఒక అంతుచిక్కని రహస్యం చుట్టూ ఉండే విధంగా దర్శకుడు డిజైన్ చేసినట్లు టాక్. అది ఒక గ్రామం ఒక నిఘాడమైన రహస్యం ఆఊరిని పట్టిపీడిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన వారు ఎవరైనా సరే కంటి చూపు పోగొట్టుకోవడమో లేదా ప్రాణాలు వదులుకోవడమో జరుగుతూ ఉంటుంది.


ఆ సంఘటనలకు గుడి లో ఉన్న అమ్మవారికి అంతుచిక్కని సంబంధం ఉంటుందట. అది ఛేదించాలని ఎంతమంది ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాదు. అయితే ఆవిషయానికి సంబంధించిన జ్ఞాపకాలు పాయల్ రాజ్ పుత్ కళ్ళకు తెలుస్తాయట. ఇలా నెటితరం ప్రేక్షకులు ఇష్టపడే హారర్ కథను సస్పెన్స్ తో ముడిపెట్టి. విరూపాక్షకి అద్భుతమైన స్కోర్ ఇచ్చిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను భయపెట్టడానికి త్వరలో రాబోతోంది. పాయల్ తో పాటు నందితా శ్వేత దివ్య పిళ్ళై అజ్మల్ అజయ్ ఘోష్ లక్ష్మణ్ రవీంద్ర విజయ్ కృష్ణ చైతన్య శ్రవణ్ రెడ్డి శ్రీతేజ్ ఇతర పాత్రలలో నటించిన ఈమూవీ సక్సస్ అయితే మళ్ళీ పాయల్ రాజ్ పుత్ అజయ్ భూపతి ల క్రేజ్ మళ్ళీ పెరిగే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: