రంగబలి సినిమాతో నాగశౌర్య సక్సెస్ అయినట్టేనా..?

Divya
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా విడుదల ముందు నుంచే సత్యా స్పూఫ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఒక టీవీ కార్యక్రమంలో కొత్త దర్శకుడు పవన్ బాసం శెట్టి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకర్షించే పనిలో పడ్డారు. మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అయిందని విషయానికి వస్తే.. కథపరంగా ఈ సినిమా మెడికల్ షాప్ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబ పోషణ బాధ్యతలను తండ్రి చూసుకుంటూ ఉంటారు కానీ తన కుమారుడు బీఫార్మసీ చదివిన (నాగశౌర్య) కు ఆ షాప్ అప్పగించాలని తండ్రి ప్లాన్ చేస్తూ ఉంటారు.

కానీ హీరోకు గొడవలు అంటే చాలా ఇష్టం ఉండి వైట్ షర్ట్ వేసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు.. ఇందులో విలన్ గా నటించిన (షైన్ టామ్ చాకో ) తో ఉండేటువంటి ఫోటోలను దిగి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇలాంటివన్నీ తండ్రికి నచ్చకపోవడంతో పై చదువుల కోసం విశాఖలో ఒక మెడికల్ కాలేజీలో చదివించడానికి పంపించగా అక్కడ సహజ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆ తర్వాత హీరోయిన్ తన ప్రేమను తన తండ్రికి చెబుతుంది.. వీరి పెళ్లి మొదట ఒప్పుకున్న హీరోయిన్ ఫాదర్ ఆ తర్వాత ఇతని ఊరు పేరు రంగబలి అని తెలుసుకొని ఆ ఊరు విడిచిపెట్టి విశాఖకు వచ్చేయమని తెలియజేస్తారట. ఇక రంగ బలి ఊరు వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయమే స్టోరీ.


డైరెక్టర్ పవన్ బాసింశెట్టి రంగుబలి సినిమాను ఛలో సినిమా కథతో ప్రేరణగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం హీరో నాగ శౌర్య క్యారెక్టర్జేషన్ ఎలివేషన్ సత్య కామెడీ అందరిని బాగానే ఆకట్టుకున్నాయి. హీరో హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి..
స్టోరీ, ఫస్టాఫ్ కామెడీ ,సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్ విషయానికి వస్తే:
సెకండాఫ్, కనెక్ట్ కానీ ఫ్లాష్ బ్యాక్, ఎడిటింగ్

ఓవరాల్ గా రంగబలి సినిమా ఆకట్టుకునే కామెడీ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: