ప్రాజెక్ట్-k నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆరోజు ఫాన్స్ కి పండగే..!!
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా విడుదల కాకముందే ఒక అరుదైన గౌరవాన్ని సైతం అందుకుంటోంది .గత కొద్ది రోజుల నుంచి ప్రాజెక్ట్ -K సినిమా విషయంలో టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోంది అనే విషయం వినిపిస్తూనే ఉంది ఈనెల 20వ తేదీన రివిల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.
శాన్ డియాగో కామిక్ కాన్ (SDCC) ఈ వేడుకలలో భాగంగా ప్రాజెక్ట్-K సంబంధించి టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు మాత్రం ఇలాంటి ఘనత అందుకోలేదని తెలుస్తోంది.అమెరికాలో జూలై 19వ తేదీన ఈ వేడుకలు ప్రారంభం కాగా 20వ తేదీన ప్రాజెక్ట్-K చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ ను రివిల్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.