కమెడియన్ సత్య ను సరిగా ఉపయోగించుకోవట్లేదా ..?
ఈ క్రమంలోనే సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొందరు మీడియా పర్సనాలిటీస్ ని ఇమిటేట్ చేస్తూ సత్య చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూ చూశాక సత్యను మన నిర్మాతలు, దర్శకులు సరిగ్గా వాడుకోవడం లేదా అన్న అనుమానం కలుగుతుంది. సాధారణంగా ఒక డైరెక్టర్ కథ రాసినప్పుడు అందులో పాత్ర స్వభావాలను ఓన్ చేసుకోవడం అనేది అంత కష్టమేమీ కాదు. ముఖ్యంగా మీడియాలో ఉన్న కొందరు పర్సనాలిటీస్ ని వారు ఎలా బిహేవ్ చేస్తారో ఖచ్చితంగా అలాగే సత్య వారిని ఇమిటేట్ చేశాడు.
ఇది చూసిన వాళ్లంతా అతనిలో చాలా టాలెంట్ ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .కానీ ఇకనుంచి అయినా సత్య ను వాడుకోవడంలో దర్శక నిర్మాతలు కొంచెం దృష్టి పెట్టాలని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక రంగబలి సినిమాను పవన్ డైరెక్టర్ గా పనిచేయగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానుల సైతం ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే సత్యాలోని టాలెంటును పవన్ ఏ విధంగా వాడుకున్నాడు అనేది తెలియాలి అంటే ఇక రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.