అందుకే అతన్ని ప్రేమించా: తమన్నా

Purushottham Vinay
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో వుంది. దాదాపు 17 ఏళ్లుగా టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ గా సత్తా చాటుతుంది. ఇక ఇప్పుడు కేవలం సినిమాలతోనే కాకుండా.. అటు బాలీవుడ్ వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది మిల్కీబ్యూటీ.అయితే ఇటీవల పలు వెబ్ సిరీస్‏లలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది తమన్నా. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా రొమాంటిక్ సీన్స్ చేయడంతో ఆమెపై నెట్టింటా తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. తమన్నా మొదటిసారి ఇలా శ్రుతిమించి నటించడంతో ముఖ్యంగా టాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆమెపై వ్యతిరేకత వస్తుంది. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ పై  ఆసక్తికర కామెంట్స్ చేసింది మిల్కీబ్యూటీ. రొమాంటిక్ సీన్స్ హీరోస్ చేసినప్పుడు అసలు వారిని ఎందుకు ప్రశ్నించరు.. కేవలం హీరోయిన్స్ నటిస్తే ఇంత నెగిటివిటి మీకు ఎందుకు వస్తుందంటూ వైరల్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమించడం గురించి కూడా చెప్పుకొచ్చింది.ఇక గత కొద్ది రోజులుగా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


ఇక ఆ రూమర్స్ నిజమేనంటూ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చి క్లారిటీ ఇచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలోనే విజయ్ తో ప్రేమలో పడ్డానని ఆమె తెలిపింది. రీసెంట్ గా ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా.. తమ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.“విజయ్ వర్మ నా జీవితంలోకి వచ్చినందకు చాలా హ్యాపీగా ఉంది. అతను మహిళలను చాలా గౌరవిస్తారు. ముఖ్యంగా నా అభిప్రాయాలకు ఇంకా గౌరవం ఇస్తాడు. అందుకే నేను అతడిని మనసారా ప్రేమించాను.పైగా తనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వారితో ఎలా ఉంటారో బయటివారితో కూడా అలాగే ఉంటారు. ఇతరులను గౌరవించడం ప్రస్తుతం యువత ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీ పడాలనే భావనను నేను అసలు అంగీకరించను.”అని అన్నారు తమన్నా. ప్రస్తుతం మిల్కీబ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: