కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన బడా నిర్మాత..!?

Anilkumar
కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు లభించింది. ఇటీవల విక్రాంత్ రోణా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన మరో సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. భారీ చిత్రాల నిర్మాత కలయిపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా 46 సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు యూనిట్.ఈ క్రమంలో నే కన్నడ నిర్మాత ఎంఎన్ కుమార్ ఆయన పై పులు ఆరోపణలని చేయడం జరిగింది. తన బ్యానర్లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా చేయడం లేదు అని.. సినిమా చేయకుండా నన్ను మోసం చేశాడని ఆయన పేర్కొన్నారు. 


ప్రాజెక్టు కోసం సుదీప్ 9 కోట్ల రూపాయలు ఇచ్చానని కానీ.. డేట్స్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు అంటూ ఆయనపై ఆరోపణలు వేశారు. ఇప్పటికే కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫర్ కామర్స్ వద్ద ఫిర్యాదు కూడా చేశానని ఆయన పేర్కొన్నారు. సుమారు 8 ఏళ్ల క్రితం సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరినట్లుగా ఆయన తెలిపారు. కానీ ఇప్పటివరకు డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు అంటూ పేర్కొన్నాడు నిర్మాత. సినిమాకి సంబంధించిన తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్తో పాటు మరొక 10 లక్షలు తన వంటగది రేనోవేషన్ కోసం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.


అంతేకాదు సినిమా కోసం దర్శకుడు నందకిషోర్ కి అడ్వాన్స్ సైతం చెల్లించడంతోపాటు ఈ సినిమాకి ముత్తుట్టి సత్యరాజు అనే టైటిల్ని కూడా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసామంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. కానీ తమ బ్యానర్ లో సినిమా చేయకుండా ఒక తమిళ నిర్మాతతో సుదీప్ మూవీ ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. తన దగ్గర రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కానీ తన బ్యానర్లో మాత్రం సినిమా చేయడం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: